Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పట్టుదలకు పోయి ప్రజలపై కరువు భారం
By NT News telugu||5 min read at Namasthe Telangana
In brief
The article criticizes the state government for failing to utilize available water from the lower Godavari river during a severe drought, alleging that the government ignored expert advice and warnings to save water for agriculture and drinking.
It contrasts this with the neighboring state of Andhra Pradesh, which allegedly managed to save crops by using water that crossed the border, while local projects like Sriram Sagar and Nizam Sagar were left dry.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాష్ట్రంలో వర్షాకాలంలో నాలుగు నెలలు ఎక్కడా నీటి లభ్యత లేకపోయినా దిగువ గోదావరిలో మాత్రం 25 వేల క్యూసెక్కులకు తగ్గకుండా 7 లక్షల క్యూసెక్కుల దాకా ప్రవాహాలు నమోదైన సంగతి మనకు తెలుసు, ప్రభుత్వానికీ తెలుసు. మేడిగడ్డ వద్ద ప్రవాహాలు ఈ రకంగా ఉంటే, ఎగువన శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్, కడెం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కుమ్రం భీం లాంటి మీడియం ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహాల జాడనే లేదు. ఇక వానలు పడి వరదలు వస్తాయని ఆశించే ప్రభుత్వమైనా, మరెవరైనా ప్రస్తుతం రాష్ట్రంలో వర్షపాతం ఎట్లా ఉన్నది? రాబోయే రోజుల్లో వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అంచనాలు ఎట్లా ఉన్నాయి? అనే విషయాలను పరిశీలించాలి.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో 20 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ ఈ ఏడాది జూలైలోనే హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు, సెప్టెంబర్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆశించిన రీతిలో జలాశయాలు, చెరువుల్లోకి నీరు చేరే స్థితి ఉండదని ప్రభుత్వం ఎందుకు ఊహించలేకపోయింది? వర్షాకాలం ముగిసిన తర్వాత రాష్ట్రంలో లోటు వర్షపాతం 23%గా నమోదైంది. సాధారణ వర్షపాతం 795.7 మి.మీ. కాగా, కేవలం 615.8 మి.మీ. మాత్రమే కురిసింది. వాతావరణ శాఖ హెచ్చరికలను ప్రభుత్వం చేసి దిగువ గోదావరిలో మాత్రమే లభ్యమవుతున్న నీటిని వదిలేయడాన్ని ఏమనాలి?
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)