Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Payal Rajput : నా శరీరం.. నా ఇష్టం.. మీకెందుకు?.. బాడీ షేమింగ్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Telugu film actress Payal Rajput strongly condemned body-shaming and obscene comments on social media, asserting her right to her own body.
Her post went viral, drawing support from netizens who agreed that personal appearance should not be subject to public criticism.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ మరో సారి హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో తనపై వ్యాఖ్యలు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శరీరాకృతిని లక్ష్యంగా చేసుకుని వీడియోలు షేర్ చేస్తూ, అసభ్యంగా కామెంట్లు చేస్తున్న వారికి గట్టిగా బదులిచ్చారు. తన శరీరం, తన రూపం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తూ ఘాటైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
బుధవారం అర్ధరాత్రి ఎక్స్ వేదికగా స్పందించిన పాయల్.. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. "నా శరీరంపై అసహ్యకరమైన కామెంట్లు చేస్తూ, ఈ వీడియోలను షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. నా శరీరం, నా సైజు, నా గర్వం. ఇవి మీ చర్చలకు, మీ అభిప్రాయాలకు, మీ అసభ్యతకు సంబంధించిన విషయాలు కావు. మీ హద్దుల్లో మీరు ఉండండి.. మీ పని మీరు చూసుకోండి" అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత రూపాన్ని విమర్శిస్తూ ఇతరులను కించపరచడం ఎంతవరకు సమంజం అంటూ ప్రశ్నించింది పాయల్. ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)