Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్ అంకిత్
By Eenadu1 min read at Eenadu
In brief
District Collector Ankit instructed officials to thoroughly examine and resolve pending public grievances during the Prajavani program in Bhadradri.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భద్రాద్రి: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించే ప్రతి వినతిని క్షుణ్నంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనతో కలిసి ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని సూచించారు. ప్రతి అర్జీపై క్షేత్రస్థాయిలో అవసరమైన విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం సత్వర పరిష్కారం చూపాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వాటిపై తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ సూచించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేయడంతో పాటు, దరఖాస్తుదారులకు పరిష్కార సమాచారం అందించాలని ఆదేశించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)