Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పెన్పహాడ్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
In Penpahad, there are allegations that wine shop managers are selling liquor above the Maximum Retail Price (MRP) by charging an extra Rs.
10 per bottle.
A local resident, Bhukya Praveen, complained that the staff threatened him with rude behavior when he refused to pay the extra amount, calling it systematic exploitation of daily consumers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పెన్పహాడ్, నవంబర్ 05 : పెన్పహాడ్ మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ వైన్స్ నిర్వాహాకులు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మార్పీ ధరల కంటే అదనంగా రూ.10 వసూళ్లకు పాల్పడుతూ మద్యం ప్రియులను నిలువు దోపిడి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని త్రిశూల వైన్స్ లో జరుగుతున్న ఈ బహిరంగ దోపిడీపై గురువారం దుబ్బతండా గ్రామానికి చెందిన భూక్య ప్రవీణ్ అనే వ్యక్తి తన గోడు వెల్లబోసుకోగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. భూక్య ప్రవీణ్ తన ఇంట్లో జరిగే శుభకార్యం నిమిత్తం మద్యం కొనుగోలు…
అయితే అక్కడ కౌంటర్ లో ఉన్న సిబ్బంది ప్రతి సీసాపై ఎమ్మార్పీ రేటు కంటే అదనంగా రూ.10 చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పినట్లు ఆయన ఆరోపించాడు. ప్రభుత్వ నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ఎందుకు ఇవ్వాలని నిలదీయగా… అదనపు డబ్బులు ఇస్తేనే సరుకు ఇస్తామని, లేదంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ సిబ్బంది దురుసుగా సమాధానం ఇచ్చినట్లు ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదని, ప్రతిరోజూ వందలాది మంది మద్యం వినియోగదారులపై జరుగుతున్న నిలువు దోపిడీ అని ఆయన మండిపడ్డారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)