Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పెట్రోల్లో 31.2% ఇథనాల్!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Karnataka government stated that petrol samples sold by major oil marketing companies contained significantly more than the mandated 20% ethanol blend.
Independent laboratory tests confirmed ethanol concentrations as high as 31.2% in IOCL petrol, prompting the state government to warn of potential financial losses for motorists due to reduced mileage and increased maintenance costs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బెంగళూరు, నవంబర్ 6: చమురు మార్కెటింగ్ కంపెనీలు విక్రయించే పెట్రోల్లో నిర్దేశిత ఇథనాల్ 20%(ఈ20) మిశ్రమం కంటే గణనీయంగా ఎక్కువ ఉందని కర్ణాటక ప్రభు త్వం శుక్రవారం పేర్కొంది. వివిధ కంపెనీల పెట్రోల్ నమూనాలను పరీక్షించగా పలు నమూనాలలో ఇథనాల్ గాఢత 20%కి మించి ఉన్నట్టు గుర్తించామని, అధికంగా ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులు గురయ్యేఅవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కర్ణాటక వ్యాప్తంగా ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, షెల్ వంటి ప్రధాన చమురు విక్రయ సంస్థల నుంచి మొత్తం 63 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను మొదట ఆయా చమురు విక్రయ సంస్థల ప్రయోగశాలలకు పంపారు.
వీటితో పాటు కొన్ని ప్రశ్నలను కూడా జత చేశారు. అందులో ప్రతి నమూనాలో ఉన్న ఇథనాల్ పరిమాణానికి సంబంధించిన వివరాలను కోరే ప్రశ్న కూడా ఉంది. అయితే, ఇథనాల్ పరిమాణంపై ఆయా కంపెనీలు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని, ఇందులో ఏదో తేడా ఉందనే అనుమానం రాష్ట్ర ప్రభుత్వానికి కలిగిందని సమాచారం. ప్రభుత్వం ఆ నమూనాలను స్వతంత్ర పరీక్షల కోసం ప్రైవేట్ ప్రయోగశాలలకు పంపింది. బెంగళూరు అర్బన్ సహా ఏడు జిల్లాల నుంచి సేకరించిన నమూనాల పరీక్షల్లో ఇథనాల్ గాఢత 20% అనే ప్రామాణిక స్థాయిని మించి ఉన్నట్టు తెలిసింది. ఈ నమూనాలను బెంగళూరుకు చెందిన శ్రీరామ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరీక్షించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)