Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మినీ మేడారం జాతర
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
మంత్రి సీతక్క ములుగు జిల్లాలో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్ జాతరల అవసరాలకు అనుగుణంగా శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
గోదావరి పుష్కరాలకు ముందస్తు కార్యాచరణ కచ్చితంగా చేయాలని, శాఖల వారీగా ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మినీ మేడారం జాతర జరగనుందని మంత్రి ప్రకటించారు. రాబోయే రెండు నెలల పాటు మినీ జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్ జాతరల అవసరాలకు అనుగుణంగా శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
మేడారంతో పాటు అనుబంధ జాతరల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రహదారుల విస్తరణ జరగాలని మంత్రి చెప్పారు. గోదావరి పుష్కరాలకు ముందస్తు కార్యాచరణ కచ్చితంగా చేయాలని, శాఖల వారీగా ప్రతిపాదనలు సమర్పించాలని.. ఐలాపురం జాతరలో మౌలిక వసతుల కల్పనపై ఐటీడీఏ ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సీతక్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)