Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PM Modi: ఆర్థిక వ్యవస్థలపై దాడులతోనూ యుద్ధాలు - ప్రధాని మోదీ
By Eenadu2 min read at Eenadu
In brief
Prime Minister Narendra Modi stated that modern warfare increasingly targets economic systems and emphasized the need to protect India's banking sector from cyber threats.
Speaking at an event in Odisha, he inaugurated an RBI data centre and a cybersecurity training centre, and contrasted current financial inclusion policies with those of the past.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం యుద్ధాలు సంప్రదాయ విధానాల్లోనే కాకుండా ఆర్థిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని కూడా జరుగుతున్నాయని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. అయితే, భారత బ్యాంకింగ్ రంగం ప్రపంచంలోనే అత్యంత సమర్థమంతమైనదన్నారు. ఈ క్రమంలో నుంచి మన బ్యాంకింగ్ వ్యవస్థలను రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒడిశాలో రూ.169 కోట్లతో ఆర్బీఐ డేటా సెంటర్ (Data Centre), సైబర్ సెక్యూరిటీ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
‘‘నేడు యుద్ధాలు కేవలం ఆయుధాలతో మాత్రమే జరగడం లేదని అందరికీ తెలుసు. ఆర్థిక వ్యవస్థపై దాడులతో దేశాన్ని బలహీనపరచవచ్చు. ఇటీవల సైబర్ ముప్పులు వివరీతంగా పెరిగాయి. భారత్ ఆర్థికంగా బలోపేతం అవుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు, సైబర్ ఉగ్రవాదుల నుంచి మన బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించుకోవడం అంతే కీలకంగా మారింది. కాలం చెల్లిన వ్యవస్థలు, పాత పద్ధతుల్లో కొత్త సవాళ్లను ఎదుర్కోలేం. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరం. ఇక్కడే సైబర్ సెక్యూరిటీ (Cybersecurity) వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)