Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PNB Accounts: మూడేళ్లు దాటినా వాడని ఖాతాలు మూత: పీఎన్బీ
By Eenadu1 min read at Eenadu
In brief
Punjab National Bank (PNB) announced that it will close accounts that have remained inactive for three years without any transactions.
Customers who wish to reactivate their accounts must complete their KYC (Know Your Customer) process by November 10 to prevent permanent closure.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
PNB Accounts | ఇంటర్నెట్‌డెస్క్: ప్రభుత్వంరంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఖాతాదారులకు అలర్ట్. మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఖాతాలను మూసివేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబర్ 30 నాటికి గడిచిన మూడేళ్లలో ఎలాంటి లావాదేవీలు చేయని, నగదులేని ఖాతాలను మూసివేయనున్నట్లు పీఎన్బీ పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఈ తరహా ఖాతాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ తరహా ఖాతాలు రీయాక్టివేట్ చేయాలనుకుంటే నవంబర్ 10లోగా నో యువర్ కస్టమర్ (KYC)ని పూర్తి చేయాలని బ్యాంక్ సూచించింది. నిర్దేశిత గడువులోగా కేవైసీ పూర్తి చేయకుంటే ఆ ఖాతాలను శాశ్వతంగా మూసివేస్తామని బ్యాంక్ తెలిపింది. కాబట్టి మూడేళ్లుగా లావాదేవీలు చేయని ఖాతాదారులు సమీపంలోని పీఎన్బీ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని బ్యాంక్ సూచించింది. ఏవైనా సందేహాలుంటే 1800-1800, 1800-2021 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఓ ప్రకటనలో సూచించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)