Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పోలీస్ బ్యాండ్‌కు పూర్వ వైభవం తెస్తాం..బ్యాండ్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తాం: డీజీపీ సీవీ ఆనంద్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన పోలీస్ బ్రాస్ బ్యాండ్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
దేశవ్యాప్తంగా పోలీస్, కేంద్ర సాయుధ బలగాల సంగీత ప్రతిభను చాటిచెప్పే 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను ఆయన ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లా సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో ఈ నెల 20 వరకు ఐదు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన పోలీస్ బ్రాస్ బ్యాండ్‌కు మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని, పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పోలీస్ బ్యాండ్లు కేవలం సంగీత బృందాలు మాత్రమే కాదని, క్రమశిక్షణ, గుర్తింపు, గౌరవం, సమష్టి స్ఫూర్తికి ప్రతీకలని చెప్పారు. దేశవ్యాప్తంగా పోలీస్, కేంద్ర సాయుధ బలగాల సంగీత ప్రతిభను చాటిచెప్పే 27వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లా సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్లో ఈ నెల 20 వరకు ఐదు రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మాట్లాడుతూ జాతీయ వేడుకలు, కవాతులు, గౌరవ వందనాలు, పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో బ్యాండ్ల పాత్ర కీలకమని చెప్పారు. ఇలాంటి పోటీలు పోలీసు బలగాల మధ్య స్నేహభావం, ఆరోగ్యకరమైన పోటీతత్వం, జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)