Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ప్రజల్లోకి సిపిఎం.. విస్తృతంగా ప్రచారం
By Prajasakti||2 min read at Prajasakti
In brief
The CPM conducted extensive door-to-door election campaigning in various municipal corporations and municipalities across multiple districts.
Candidates appealed to voters to cast their votes for the hammer, sickle, and star symbol.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో శుక్రవారం సిపిఎం అభ్యర్థుల ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగింది. పలు జిల్లాల్లోని వివిధ డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం, వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని వివరిస్తూ ప్రచారం సాగించారు.
అనంతపురం కార్పొరేషన్లో 25వ డివిజన్ అభ్యర్థి సాకే సరస్వతి, 60 డివిజన్ అభ్యర్థి సి గీత, 62వ డివిజన్ అభ్యర్థి ఎ గుల్జార్లు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని 39వ వార్డులో పోటీ చేస్తున్న ముస్తక్ ఆలీ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా సిపిఎం రాష్ర్ట నాయకులు జి ఓబులు ప్రచారంలో పాల్గొన్నారు.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)