Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to Kattangur Agricultural Officer Giriprasad, farmers should consider cultivating alternative dry crops instead of paddy during the Yasangi season due to El Nino-induced water scarcity.
A local awareness program was held in Pittampally village to educate farmers on water conservation and soil protection.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కట్టంగూర్, నవంబర్ 05 : ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వల్ల రైతులు యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కట్టంగూర్ వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ సూచించారు. ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పిట్టంపల్లి గ్రామంలో ఎల్నినో పరిస్థితులు, భూ సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
యాసంగిలో వరి సాగు వల్ల అధికంగా నీరు అవసరమవుతుందని, అందువల్ల రైతులు పరిస్థితులకు అనుగుణంగా శనగ, పెసర, మినుము, నువ్వులు, జొన్న, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనకాల వాణి కేశవులు, ఏఈఓ నవీన్, రైతులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)