Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ప్రవళికకు ప్రభుత్వం అండ : పొన్నం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Minister Ponnam Prabhakar visited RTC conductor Pravallika at a Hyderabad hospital and assured her and other RTC employees of government support.
He also instructed officials to prepare a plan to distribute sewing machines to women starting December 9.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రయాణికురాలి దాడితో తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. దిల్సుఖ్నగర్లోని సాయి సంజీవని దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రవళికకు మంగళవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆర్టీసీ సిబ్బంది పట్ల ప్రయాణికులు గౌరవంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని కోరారు. సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డిసెంబర్ 9 నుంచి కుట్టుమిషన్లు మహిళలకు డిసెంబర్ 9 నుంచి కుట్టుమిషన్లను పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన బీసీ సంక్షేమశాఖలో అమలవుతున్న పథకాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విదేశీ విద్యా నిధి పథకానికి సకాలంలో నిధులు అందేలా చూడాలని, 38 కులాల ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన జీవోల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)