Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పులికాంత గంగాధరయ్య బహుముఖ ప్రతిభాశాలి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ సాహితీమూర్తి పులికాంత గంగాధరయ్య జీవితం, కళాసేవల గురించి ఈ వ్యాసం వివరిస్తుంది.
ఆయన 1892లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కథలాపూర్లో జన్మించారని, నటుడిగా, హరికథకుడిగా, పండితకవిగా ప్రసిద్ధి చెందారని తెలిపింది.
ఆయన 1980 అక్టోబర్ 3న పరమపదించినా తెలుగు సాహితీలోకంలో చిరంజీవియై వెలుగొందుతున్నారని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దాదాపు వందేండ్ల కిందటి మాట. సినిమా పరిశ్రమ ప్రారంభమైనప్పటికీ సరైన ప్రదర్శనా సౌకర్యాలు లేని రోజులవి. తెలంగాణ ప్రాంతంలో హరికథలు, యక్షగానాలు, నాటకాలు,తోలుబొమ్మలాటలు, వీధి భాగవతాలు మొదలైన కళా ప్రదర్శనలను ప్రజలు అత్యంత శ్రద్ధాసక్తులతో ఆదరిస్తున్న తరుణం అది. అలాంటి రోజుల్లోనే పద్యాలు, పాటలు, భజన కీర్తనలు, శతకాలు, హరికథలు, యక్షగానాలు, తత్వగీతాలు, నాటకాలు, మేలుకొలుపులు రాసి పండిత పామర జనుల్ని మెప్పించిన ప్రముఖ విద్వత్కవి పులికాంత గంగాధరయ్య.
తెలంగాణ సాహితీమూర్తులు క్రీ.శ.1892లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా (నేటి జగిత్యాల జిల్లా)లోని కథలాపూర్ గ్రామంలో నాగయ్య, లింగమ్మ దంపతులకు గంగాధరయ్య జన్మించారు. నటుడిగా, హరికథకుడిగా, పండితకవిగా ఆయన బాగా ప్రసిద్ధి చెందారు. గంగాధరయ్య నాయక పాత్రధారిగా పలు గ్రామాల్లో నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన సోదరులు రాజయ్య, చిన్న రాజయ్య ప్రదర్శించే నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించేవారు. గయోపాఖ్యానం, భక్త అంబరీష, కుశలవ, భక్త రామదాసు, లక్షణ పరిణయం, సీమంతినీ పరిణయం, రుక్మిణీ కల్యాణం, శివకుమార నాటకం, కూకద మహారాజు చరిత్ర, హంసధ్వజ నాటకం, చిరుతొండ నాటకం, సావిత్రీ పరిణయం, విరాట్ విశ్వబ్రహ్మం చరిత్ర మొదలైన 20కి పైగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)