Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pune Metro Pink Line: ఇది మహిళల ‘మెట్రో లైన్’.. దేశంలోనే మొదటిది
By Eenadu1 min read at Eenadu
In brief
Prime Minister Narendra Modi is set to virtually inaugurate Pune Metro Line-3, the country's first metro line to be operated entirely by women. The 23-kilometer line connects Maan to the District Court metro station and will significantly improve daily commutes for IT employees traveling between the Hinjewadi IT hub and Shivajinagar.
During the event, the Prime Minister will also lay the foundation stone for Pune Metro Phase-2, which includes Lines 2A, 2B, 4, and 4A with an estimated cost of Rs.
13,500 crore.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని పుణెలో రూ.8,300 కోట్ల వ్యయంతో నిర్మించిన మెట్రో లైన్-3 (పింక్ లైన్)ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు మెట్రో రైలు ఫొటోలను ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. 23 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మెట్రో లైన్ను మొత్తం మహిళా ఆపరేటర్లే నిర్వహించనుండటం దీని ప్రత్యేకత. ఇలాంటిది దేశంలోనే మొదటిదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అదేవిధంగా ఈ లైన్ విద్యుత్ అవసరాల్లో దాదాపు 30 శాతం సౌరశక్తి ద్వారా సమకూర్చనున్నట్లు తెలిపింది.
మాణ్ నుంచి డిస్ట్రిక్ట్ కోర్టు మెట్రో స్టేషన్ వరకు ఈ పింక్ లైన్ను నిర్మించారు. దీని ద్వారా ఐటీ హబ్ హింజవడీ, ఉపాధి కేంద్రమైన శివాజీనగర్ మధ్య వేలాది మంది ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల రోజువారీ రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. రూ.13,500 కోట్ల అంచనా వ్యయంతో పుణె మెట్రో ఫేజ్-2 పనులకు కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఫేజ్లో భాగంగా లైన్ 2ఏ, 2బీ, లైన్ 4, 4ఏ కలిపి మొత్తం 44.39 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)