Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రాగి సంకటి నుంచి నాటుకోడి పులుసు దాకా.. హైదరాబాద్‌లో పల్లె రుచుల సందడి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that traditional Telangana village dishes are gaining popularity in Hyderabad restaurants as healthier and nostalgic alternatives to fast food.
The article notes that millet-based dishes and clay-pot cooked traditional meals are attracting health-conscious urban consumers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
జొన్న రొట్టె.. దాంట్లోకి నాటుకోడి కూర.. పక్కన పచ్చిమిర్చి పచ్చడి, ఉల్లిగడ్డ ముక్కలు.. ఈ కాంబినేషన్ పేరు చెబితేనే నోరూరుతుంది కదా! ఒకప్పుడు పల్లె వంటింట్లో ఘుమఘుమలాడిన ఈ రుచులు ఇప్పుడు హైదరాబాద్ రెస్టారెంట్లలో స్పెషల్ మెనూగా మారాయి. పిజ్జాలు, బర్గర్లకు అలవాటుపడిన సిటీ జనం మళ్లీ తెలంగాణ పల్లె రుచుల వైపు అడుగులేస్తున్నారు. జొన్న రొట్టెలు, రాగి సంకటి, సజ్జ గటక నుంచి మట్టి కుండలో వండిన నాటుకోడి పులుసు దాకా.. పాతకాలపు వంటకాలు కొత్త రూపంలో ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బిజీ సిటీ లైఫ్‌లో ఇవి కేవలం తిండి కాదు, చిన్ననాటి జ్ఞాపకాలను, ఊరి అనుభూతులను గుర్తుచేస్తున్నాయి.
టేస్టింగ్ పౌడర్లు, రసాయనాలు లేకుండా మట్టి కుండల్లో, కట్టెల పొయ్యిపై వండిన నాటుకోడి పులుసు, తలకాయ కూర, బోటి ఫ్రై, పాయా, బగారా అన్నం, పప్పుచారులోని సహజ రుచిని సిటీ జనం బాగా ఇష్టపడుతున్నారు. అల్యూమినియం, స్టీల్ పాత్రలను పక్కనబెట్టి మట్టి కుండల్లో వండే బిర్యానీలకూ డిమాండ్ పెరిగింది. చాలా రెస్టారెంట్లు తిండి మాత్రమే కాకుండా మంచెలు, తాటిపాకలు, మట్టి గోడలతో పల్లెటూరి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కర్మన్‌ఘాట్ నుంచి సికింద్రాబాద్ దాకా సిటీలోని చాలా ప్రాంతాల్లో తెలంగాణ వంటకాల థీమ్ రెస్టారెంట్లు, దాబాలు వెలిశాయి. ఫాస్ట్ లైఫ్‌కు అలవాటైన సిటీ జనానికి ఇవి మన సంస్కృతిని గుర్తుచేస్తూ మంచి అనుభూతిని…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)