Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రాహుల్.. జవాబ్‌దో.. చెప్పిన మాటలెన్ని? చేసినవెన్ని? మ్యానిఫెస్టో ధోకాపై మౌనమేనా?
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
The article reports on Rahul Gandhi's upcoming visit to Hyderabad for the Bharat Summit and questions his absence from the state since the 2023 elections.
It details unfulfilled promises made to unemployed youth and farmers, and highlights ongoing protests by gig workers regarding the implementation of welfare laws.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల్లో ఎప్పుడంటే అప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. అర్ధరాత్రి వేళ అశోక్‌నగర్ వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో తిరిగి నిరు ద్యోగులను కలిసి ఆశ పెట్టారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇచ్చే భరోసా నాది’ అని మాటిచ్చారు. అక్కడి నుంచి వరంగల్ పోయి రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అన్నారు. నాలుగు యాత్రలు, 11 బహిరంగ సభల్లో పాల్గొని ఒకో వర్గాన్ని కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుందని ఊరించారు. రాహుల్…
శుక్రవారం అర్ధరాత్రి రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. నేడు హైటెక్స్‌లో జరిగే భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో ప్రసంగిస్తారు. ఇదే సందర్భంలో ఆయన గిగ్, ప్లాట్ ఫామ్ వరర్లతో సమావేశమవుతారు. ‘నాడు అర్ధరాత్రి అశోక్‌నగర్ వెళ్లి నిరుద్యోగులను పలుకరించిన రాహుల్, ఇప్పుడు అదే అర్ధరాత్రి వచ్చి కార్యక్రమాలను ముగించుకొని ఢిల్లీకి వెళ్లిపోతారా? లేక తాను ఇచ్చిన హామీల కోసం ఎదురుచూస్తున్న యువత, రైతుల మధ్యకు వెళ్లే ధైర్యం చేస్తారా? వరంగల్ రైతు డిక్లరేషన్ ఎంత వరకు అమలు అవుతున్నదని రైతులతో ముఖాముఖి మాట్లాడుతారా?’ అని తెలంగాణ రైతులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)