Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రాప్తాడు నిందితుడికి పల్మనరీ ఎంబాలిజం
By Eenadu1 min read at Eenadu
In brief
The accused in a school attack in Raptadu, Anantapur district, named Hemanth, was diagnosed with a pulmonary embolism, and his doctors recently amputated his right leg due to a loss of blood circulation.
He is currently receiving treatment under medical supervision at the Anantapur General Hospital.
The article also notes that medical experts explained the causes and risks of pulmonary embolism.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఈనాడు, అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం(రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి) సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్ కుడికాలికి రక్తప్రసరణ నిలిచి, కుళ్లిపోవడంతో వైద్యులు ఇటీవల దానిని తొలగించారు. అప్పటినుంచి అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
హేమంత్ రెండు రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొని మంచంపై నుంచి పడి పోయాడు. వైద్యులు సీటీ స్కాన్ చేయించగా పల్మనరీ ఎంబాలిజం బయటపడింది. దీనికి ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. శస్త్రచికిత్సల తర్వాత(పోస్ట్ ఆపరేషన్ కాంప్లికేషన్) తలెత్తే తీవ్రమైన సమస్యల్లో పల్మనరీ ఎంబాలిజం ఒకటని వైద్య నిపుణులు చెప్పారు. శరీరంలో ప్రవహించే రక్తం చిన్నచిన్న గడ్డలుగా మారడమే ఇందుకు ప్రధాన కారణం. ఇలా ఏర్పడిన గడ్డలు ఊపిరితిత్తుల రక్తనాళాల్లో చిక్కుకుపోతే రక్తప్రసరణకు అంతరాయం కలిగి, గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడి ప్రాణాపాయం తలెత్తే అవకాశం ఉంటుందన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)