Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరిగిందని, రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారని ఈ వార్త వివరిస్తోంది.
ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లటి గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పొగమంచు కమ్ముకుంటుందని, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో చలి చంపేస్తున్నది. రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరుగడంతో పొగమంచు కమ్మేస్తున్నది. ఉదయం 9 గం టల వరకు సూర్యుడు కనిపించడం లేదు. ఉత్తరాది నుంచి వీస్తున్న చల్లటి గా లులు తెలంగాణపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, హనుమకొండ వంటి జిల్లాల్లో పగలు ఎం డ ప్రభావం కనిపిస్తున్నది.
సాయంత్రం ఐదు గంటలు దాటగానే చలి తీవ్రత మొ దలవుతున్నది. వారం రోజులుగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్లో కోహీర్లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికా ర్డు అయ్యాయి. జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, కంగ్టి ప్రాంతాల్లో చలి క్ర మంగా పెరుగుతున్నది. ఆదివారం రాష్ట్రంలోని కుమ్రం భీం జిల్లా సర్పూర్లో 11.4 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా గాంధారీలో 11.6 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా నాగర్కర్నూల్లో 12.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)