Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రహదారిలో ఇరుక్కుపోయిన ద్విచక్రవాహనం.. నిలిచిన రాకపోకలు
By Eenadu1 min read at Eenadu
In brief
A two-wheeler got stuck in a muddy and pothole-ridden road in Tadikonda village, Guntur district, causing traffic to halt on Sunday.
The vehicle could not be pulled out using a Benz lorry, but was later recovered with the help of a JCB on Monday morning.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాడికొండ గ్రామ శివారులో మరమ్మతులో ఉన్న పరిమి రోడ్డులో ఆదివారం ద్విచక్ర వాహనం ఇరుక్కుపోయింది. నిత్యం భారీ టిప్పర్లు తిరగడంతో రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షానికి బురదతో చెరువుల్లా మారాయి. బురదలో కూరుకుపోయిన వాహనాన్ని బయటికి తీసేందుకు బెంజ్ లారీతో ప్రయత్నించినా విఫలమైంది. దీంతో ఆదివారం నుంచి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు కూరుకుపోయిన ద్విచక్రవాహనాన్ని సోమవారం ఉదయం జేసీబీ సహాయంతో బయటకు తీశారు. ఈ రెండు రోజుల్లో ఓ కారు, బస్సు, టిప్పర్లు ఇరుక్కుపోయాయి. ఈ రోడ్డులో ప్రయాణించేందుకు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)