Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైల్వే సమాచార వ్యవస్థలో ‘భోలు ఏఐ సేవలు’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
దక్షిణ మధ్య రైల్వే 2026 మే నెలలో కాచిగూడ, మలాజిగిరి రైల్వే స్టేషన్లలో భోలు ఏఐ (Bholu AI) సేవలను ప్రవేశపెట్టింది.
ఈ స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (LLM) ద్వారా ప్రయాణికులకు సహజ భాషలో సమాచారం అందించబడుతుంది.
ఈ వ్యవస్థను కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, నిజామాబాద్ స్టేషన్లకు కూడా విస్తరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే 2026 మే నెలలో కాచిగూడ, మలాజిగిరి రైల్వే స్టేషన్లలో స్మార్ట్, ఇంటరాక్టివ్, బహుభాషా సహాయక వ్యవస్థల ద్వారా భోలు మినీ, భోలు మాక్స్‌లను ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, రైల్వే ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానాలు అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎమ్)ను దక్షిణ మధ్య రైల్వే తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీంతో భోలు ఏఐ ఆధారిత విచారణ కియోస్ నుంచి సహజ భాషలో ప్రయాణికుల ప్రశ్నలను అర్థం చేసుకోగల, సంబంధిత రైల్వే సమాచారాన్ని మరింత సమర్థవంతంగా అందించగల ఒక ప్రత్యేకమైన రైల్వే కృత్రిమ మేధస్సు సమాచార వేదికగా రూపాంతరం చెందింది.ఈ నేపథ్యంలో కాచిగూడ, మలాజిగిరి స్టేషన్లతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, నిజామాబాద్ వంటి ఐదు ప్రధాన స్టేషన్లకు అధునాతన భోలు ఏ.ఐ వ్యవస్థను విస్తరించారు. దీంతో రైల్వే స్టేషన్లను ఏఐ స్నేహపూర్వక స్టేషన్లుగా తీర్చిదిద్దుతున్న తొలి జోన్‌గా దక్షిణమధ్య రైల్వే నిలిచింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)