Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతన్న సంకల్పం.. చెక్‌డ్యామ్‌లోకి జలసిరి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
పెద్దపల్లి జిల్లాలోని తనుగుల, గుంపుల చెక్‌డ్యామ్ ధ్వంసమై ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు ఆరోపించారు.
దీంతో 500 మంది రైతులు సొంతంగా రూ.5 వేల నుంచి రూ.10 వేల చొప్పున జమచేసి పది రోజుల క్రితం మరమ్మతులు ప్రారంభించారు.
ఇరిగేషన్ అధికారులు అడ్డుకునే ప్రయత్నించినా రైతులు భయపడకుండా పనులు పూర్తి చేయించగా, ప్రస్తుతం చెక్‌డ్యాంలో నీళ్లు చేరడంతో పంటల సాగుకు, పశువులకు తాగునీటికి ఇబ్బంది ఉండదని సంబరపడుతున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
పెద్దపల్లి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : అన్నదాత సంకల్పం ఫలించింది. తనుగుల, గుంపుల చెక్‌డ్యాం ధ్వంసమై ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరీవాహక ప్రాంత రైతులు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయిస్తున్నారు. అధికారులు అడ్డుకునే ప్రయత్నంచేసినా లెక్క చేయకుండా పనులు చేయించారు. చెక్‌డ్యాంలోకి నీళ్లు చేరుతుండడంతో పంటల సాగుకు, పశువుల తాగునీటికి ఇబ్బంది ఉండదని సంబురపడుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో మానేరుపై ప్రతి బొట్టును ఒడిసి పట్టి, బీళ్లకు మళ్లించాలనే లక్ష్యంతో కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో మానేరు (తనుగుల-గుంపుల) నదిపై నిర్మించిన చెక్‌డ్యాం నిరుడు నవంబర్ 21న పేల్చివేతకు గురైంది.
దీంతో నీరంతా వృథాగా పోవడం, ప్రభుత్వం తెచ్చిన కరువు ప్రభావంతో గుంపుల, శంభునిపల్లి, తనుగుల గ్రామాలకు చెందిన 1500 ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఆందోళన చెందిన రైతులు చెక్ డ్యాం మరమ్మతుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే లాభం లేదనుకొని, తామే మరమ్మతులు చేయించాలనుకున్నారు. 500 మంది రైతులు రూ.5వేల నుంచి రూ.10వేల చొప్పున జమచేసి నిధులు సమకూర్చుకున్నారు. పది రోజుల క్రితం పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. విషయం తెలిసిన ఇరిగేషన్ అధికారులు అడ్డుకునేందుకు యత్నం చేశారు. అయినా రైతులు భయపడకుండా ముందుకు సాగారు. చెక్‌డ్యాంలో నీళ్లు నిలుస్తుండటంతో రైతులు హర్షం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)