Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- State labor secretary and Nalgonda El Nino special officer Dasari Harichandana visited Nalgonda district to review the impact of El Nino conditions. She inspected dried-up paddy and cotton fields and urged farmers to avoid cultivating water-intensive crops like paddy during the Rabi season.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
నల్లగొండ సిటీ, అక్టోబర్ 16 : ఎల్ నినో పరిస్థితిలను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగిలో ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎల్ నినో ప్రత్యేక అధికారి దాసరి హరిచందన అన్నారు. వ్యవసాయం, పంటలు, తాగునీరు, విద్యుత్ తదితర అంశాలపై ఎల్ నినో ప్రభావంపై ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షించే నిమిత్తం శుక్రవారం ఆమె నల్లగొండ జిల్లాకు విచ్చేశారు. సమీక్ష అనంతరం ఆమె కనగల్ మండలం, శేరిలింగోటం వద్ద నీరు లేక ఎండిపోయిన వరి, పత్తి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శేరిలింగోటం గ్రామానికి చెందిన వరి, పత్తి రైతులతో ఆమె ముఖాముఖి…
ఎల్ నినో వల్ల ఎక్కువనీరు అవసరం అయ్యే పంటలు వేస్తే భూగర్భ జలాల అధిక వినియోగంతో పాటు, విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుందని, అంతేకాక ఏదో కారణం చేత పంట చేతికి రాకపోతే రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాలన్నీ సొంతంగా అనుభవించిన రైతులు తోటి రైతులకు వారి అనుభవాలను తెలియజేయాలని, మరో రైతు నష్టపోకుండా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యాసంగిలో జిల్లా రైతులు బోర్లు, బావుల కింద ఎట్టి పరిస్థితులలో వరి వేయవద్దని, దీనివల్ల అన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. ఇదే విషయాలు తోటి రైతులతో పాటు, ఇతర ప్రాంతాల రైతులకు కూడా తెలియజేసి వారు నష్టపోకుండా చూడాలని కోరారు. తక్కువ నీరు అవసరమయ్యే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)