Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Neel Lakshmi Narayana, a farmer from Kondreddicheruvu village in Yadadri Bhuvanagiri district, became a daily wage laborer after his paddy crop died due to power cuts and lack of rain.
The farmer had invested heavily in the crop, which failed during the podduthadi stage, forcing him to sell his cattle and take up menial labor to support his family.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రాజాపేట, నవంబర్ 3: ఒకప్పుడు నలుగురికి అన్నం పెట్టిన రైతన్న.. నేడు తన కుటుంబాన్ని సాకడానికి రోజువారీ కూలీగా మారాడు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కండ్లముందే ఎండిపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. వ్యవసాయమే జీవనాధారంగా బతికిన అన్నదాతకు ఇప్పుడు కూలి పనులే దికయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కొండ్రెడ్డిచెరువు గ్రామానికి చెందిన నీల లక్ష్మీనారాయణకు ఐదెకరాల భూమి ఉన్నది. ఒక బోరు ఆధారంగా మూడు ఎకరాల్లో వరి సాగుచేశాడు.
తీరా పంట పొట్ట దశకు చేరే సమయంలో విద్యుత్తు కోతలు, వర్షాభావ పరిస్థితులతో నీరందక పంట మొత్తం ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి బూడిద కావడంతో దికుతోచని స్థితిలో పడిపోయాడు. వ్యవసాయానికి తోడుగా ఉన్న నాలుగు పశువులకు నీరు, గ్రాసం అందించలేక వాటిని సైతం అమ్ముకున్నాడు. ఓ వైపు పంట నష్టం.. మరోవైపు కుటుంబ పోషణ భారంగా కావడంతో చేసేదేమీ లేక రోజువారీ కూలీగా మారాడు. ఒకప్పుడు తన పొలంలో వ్యవసాయం చేసిన చేతులే.. నేడు కూలి పనులు చేస్తున్నాయి. వడ్లు పండించే రైతన్నే పట్టెడన్నం కోసం కష్టపడాల్సిన దుస్థితి రావడం పలువురిని కలచివేస్తున్నది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)