Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Raul Jon Aju: పుతిన్‌తో ‘భారత ఏఐ కిడ్’ సెల్ఫీ.. ఎవరీ టీనేజర్..?
By Eenadu2 min read at Eenadu
In brief
17 ఏళ్ల రౌల్ జాన్ అజు అనే టీనేజర్ మాస్కోలో జరిగిన ‘ఏఐ జర్నీ 2026’ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఆయనతో సెల్ఫీ తీసుకున్నాడు.
పుతిన్‌తో సెల్ఫీ తీసుకున్న ఈ వీడియోను అజు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అది వైరల్‌గా మారింది.
అజు ప్రస్తుతం కామర్స్ విభాగంలో 12వ తరగతి చదువుతూ, ‘మిబాట్’ అనే రోబోట్‌ను మరియు ‘ఏఐ రియల్మ్ టెక్నాలజీస్’ అనే స్టార్టప్‌ను అభివృద్ధి చేసినట్లు ఆర్టికల్ తెలుపుతోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నేరుగా కలిసే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఆయనతో సెల్ఫీ తీసుకున్నాడో టీనేజర్. ‘భారత ఏఐ కిడ్ (AI Kid of India)’గా పేరొందిన 17 ఏళ్ల కుర్రాడు రౌల్ జాన్ అజు (Raul Jon Aju) వీడియో ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఓ సదస్సులో పుతిన్ (Vladimir Putin)ను కలిసిన అజు.. ఆయనతో సెల్ఫీ తీసుకుని ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
మాస్కో వేదికగా ‘ఏఐ జర్నీ 2026’ పేరుతో అంతర్జాతీయ కృత్రిమ మేధ (Artificial intelligence) సదస్సు గురువారం ప్రారంభమైంది. భారత్, చైనా, సెర్బియా, యూఏఈ సహా పలు దేశాలకు చెందిన ఏఐ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్లీనరీ సెషన్‌కు పుతిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేరళకు చెందిన రౌల్ జాన్ అజు.. రష్యా అధ్యక్షుడిని కలిసి ఆయనతో ఫొటో తీసుకున్నాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అజు.. ‘‘9 ఏళ్ల వయసులో బాత్రూమ్లో తొలి వీడియో చేసినప్పటి నుంచి.. 17 ఏళ్లకే పుతిన్‌తో సెల్ఫీ తీసుకునే వరకు.. ఈ జీవితం నేను కలలో కూడా ఊహించని ఎన్నో అవకాశాలిచ్చింది. ఈ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)