Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రెబల్ అభ్యర్థులపై తెదేపా వేటు
By Eenadu1 min read at Eenadu
In brief
The Telugu Desam Party suspended five rebel candidates in the Tiruvuru municipal elections after they contested against the party's official alliance decisions.
The suspension was announced at a press conference led by the town president Mallela Srinivas.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తిరువూరు టౌన్: కృష్ణా జిల్లా తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించి, కూటమి రెబల్ అభ్యర్థులుగా పోటీ చేసిన ఐదుగురు నేతలను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. తిరువూరు తెదేపా కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించి అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసినందున పార్టీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సస్పెండ్ అయినవారిలో కొలికపోగు తిరుపతయ్య అలియాస్ చంటి, పీట్ల నాగేశ్వరరావు, యండ్రాతి నాగశ్రీ, అహ్మద్ పాషా, చిత్తలూరి నాగలక్ష్మి ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)