Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Revanth Reddy | కాళేశ్వరం మూడో టీఎంసీపై తొందరొద్దు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Chief Minister Revanth Reddy warned officials against making hasty decisions regarding the third TMC of the Kaleshwaram project.
He stated that the existing two TMCs of water cannot be moved and ordered a review of pending Supreme Court cases and land acquisition before proceeding.
The Chief Minister also directed officials to speed up the Dindi and Achampet lift irrigation projects and ensure the movement of 0.6 TMC of water from Narlapur to Yedula.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తేతెలంగాణ): కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉన్నదని, ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించి, భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర జలసంఘం నుంచి అవసరమైన అన్ని అనుమతులు పొందడంతోపాటు డీపీఆర్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో మంగళవారం నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం ఏదుల నుంచి డిండి, అచ్చంపేట పథకాలకు నీటిని అందించాలని చెప్పారు. ఈ రెండు పథకాలకు అవసరమైన 0.6 టీఎంసీల నీటిని నార్లాపూర్ నుంచి ఏదుల వరకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదల సలహాదారు ఆదిత్యానాథ్ దాస్, సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ శ్రీధర్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)