Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: మైసూరు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి
By Eenadu||2 min read at Eenadu
In brief
Telangana Chief Minister Revanth Reddy participated in the Mysore Dasara festival in Karnataka at the invitation of Chief Minister D.K.
Shivakumar.
He viewed the cultural events and visited the Chamundeshwari temple to offer special prayers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు: కర్ణాటకలో అత్యంత వైభవంగా నిర్వహించే మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం.. జంబూ సవారీలో అందంగా అలంకరించిన ఏనుగుపై బంగారు అంబారీలో కొలువుదీరిన చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని సీఎం దర్శించుకున్నారు. కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళాకారులు, సంగీత బృందాలు, నృత్య బృందాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ఊరేగింపులో ఆకర్షణీయంగా నిలిచాయి.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి, కళలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచేలా కర్ణాటక రాష్ట్ర పండగగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు రేవంత్రెడ్డి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్తో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి ఈ ఉత్సవాలను వీక్షించారు. అంతకు ముందు రేవంత్రెడ్డి.. చాముండేశ్వరి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)