Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
RTC Land | ఆర్టీసీ జాగ.. సర్కార్ పాగా.. హౌసింగ్ బోర్డుకు రూ.వెయ్యి కోట్ల భూమి ఇస్తూ జీవో
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
The Telangana government issued GO 206 to transfer approximately 6.5 acres of RTC land in Hyderabad's Musheerabad, valued at Rs 1,000 crore, to the Telangana Housing Board for an urban housing program.
The transfer includes a 25-gunta plot for commercial purposes and has been strongly opposed by the TGSRTU Employees Union and union leaders.
Union representatives and the state deputy secretary have demanded the cancellation of the order, threatening protests if the land is not allocated for housing the affected employees instead.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
RTC Land | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నడిబొడ్డున ఆర్టీసీకి ఉన్న అత్యంత ఖరీదైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని ముషీరాబాద్ డిపో పరిధిలో ఉన్న సుమారు రూ. వెయ్యి కోట్ల విలువైన 6.5 ఎకరాల స్థలాన్ని తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ పేరిట ఈ నెల 22న జీవో నంబర్ 206 జారీ అయింది.
ఆర్టీసీ ఆధీనంలో ఉన్న జమీస్తాన్‌పూర్ విలేజ్ పరిధిలోని పలు సర్వే నంబర్ల భూమిని అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద ఎల్ఐజీ, ఎంఐజీ ఫ్లాట్ల నిర్మాణం కోసం కేటాయించారు. లక్ష గృహాల నిర్మాణ లక్ష్యం లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే పనుల కోసం ఈ స్థలాన్ని బదలాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేరొన్నారు. కేటాయించిన మొత్తం భూమి లో 25 గుంటల స్థలాన్ని వాణిజ్య అవసరాల కోసం ప్రత్యేకంగా ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్ కలెక్టర్, సీసీఎల్ఏ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఆర్టీసీ మనుగడకు కీలకమైన స్థలాలను ఇతర అవసరాలకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)