Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rugby Competitions | జాతీయస్థాయి రగ్బీ పోటీలకు పెద్దకొడపుగల్ విద్యార్థి ఎంపిక.. తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్న క్రిష్ణ
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- B Krishna, a student from Pedda Kodapgal, Kamareddy district, was selected to represent Telangana in the national-level Under-14 boys' rugby competition. He qualified by performing well at the state-level tournament held in Hyderabad and will compete in Delhi from October 23 to 28.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Rugby Competitions | పెద్ద కొడప్ గల్, అక్టోబర్ 19 : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి బీ క్రిష్ణ జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయ్యాడు. ఎస్జీఎఫ్ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-14 బాలుర రగ్బీ విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఎంబీ హోమ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో బీ క్రిష్ణ ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సత్యం వెల్లడించారు.
ఈ ప్రతిభ ఆధారంగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రిష్ణ ఈ నెల 23 నుంచి 28వరకు ఢిల్లీలో నిర్వహించనున్న పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొననున్నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీ కమల తెలిపారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసింది. విద్యార్థి క్రిష్ణను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)