Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Russia Ukraine War: యుద్ధ వినాశనం.. 1.20 లక్షల డాల్ఫిన్ల మృత్యువాత
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports that the ongoing Russia-Ukraine war has caused the death of over 120,000 dolphins in the Black Sea since 2022, according to researcher Ivan Rusev from Ukraine's Tuzly Lagoons National Park.
It attributes the mass marine life deaths to explosions, missile tests, and sonar systems, while also noting the ecological damage from chemical and oil leaks, as well as the 2023 Kakhovka dam collapse.
Russia, however, claims that parasites and viruses are the actual cause of the dolphin deaths.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ఇరుదేశాల పౌరులకే కాకుండా.. నల్ల సముద్రంలోని (Black Sea) జీవవైవిధ్యానికి, ముఖ్యంగా జలచరాలకు ప్రాణసంకటంగా మారింది. డాల్ఫిన్లు, హార్బర్ పోర్పోయిస్ వంటి జలచరాల వేలాది కళేబరాలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు నల్ల సముద్రంలో 1.20 లక్షలకుపైగా డాల్ఫిన్లు మృతి చెందినట్లు సమాచారం. ఒక్క 2022లోనే 50 వేల డాల్ఫిన్లు మృత్యువాతపడినట్లు ఉక్రెయిన్‌లోని తుజ్లీ లగూన్స్ నేషనల్ పార్క్ పరిశోధకుడు ఇవాన్ రుసెవ్ ఓ వార్తాసంస్థకు వెల్లడించారు. మరోవైపు.. మల్లెట్, బ్లూఫిష్, స్టార్జన్ వంటి చేపల నిల్వలు తగ్గిపోవడంతో సముద్రపు ఆహార…
‘‘పేలుళ్లు, క్షిపణి ప్రయోగాలు, యుద్ధనౌకలు, సబ్మెరైన్ల నుంచి ప్రయోగించే సోనార్ వ్యవస్థల వంటి వాటితో జలచరాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. దీంతో అవి దిశను తెలుసుకోలేక, వేటాడలేక ఆకలితో అలమటించి.. చివరకు రోగనిరోధక శక్తి క్షీణించి చనిపోతున్నాయి’’ అని రుసెవ్ తెలిపారు. అదేవిధంగా.. దాడుల కారణంగా మునిగిపోయిన, దెబ్బతిన్న నౌకల నుంచి రసాయనాలు, చమురు లీక్ కావడం, 2023లో ఉక్రెయిన్ (Ukraine)లోని కఖోవ్కా ఆనకట్ట తెగిపోయి పెద్దఎత్తున కలుషిత జలాలు సముద్రంలోకి విడుదల కావడంతో అదనపు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. రష్యా (Russia) మాత్రం డాల్ఫిన్ల మృత్యువాతకు పరాన్నజీవులు, వైరస్‌లే కారణమని చెబుతోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)