Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సహజ కాన్పులపై గర్భిణులకు అవగాహన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణీలకు సహజ కాన్పుల గురించి అవగాహన కల్పించారు.
డాక్టర్ భూక్య నగేష్ నాయక్ మాట్లాడుతూ, ఉచిత మందులు, ల్యాబ్ పరీక్షలు మరియు ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సూచించిన వ్యాయామం చేయడం వల్ల సహజ కాన్పులు జరుగుతాయని, ఆపరేషన్ వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అర్వపల్లి, నవంబర్ 17 : అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గర్భిణీలకు సహజ కాన్పులు అయ్యే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డాక్టర్ భూక్య నగేష్ నాయక్ మాట్లాడుతూ.. గర్భిణీలు ప్రతినెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయించుకోవాలని, ఉచితంగా మందులు, ల్యాబ్ పరీక్షలు,అందించడం జరుగుతుందని తెలిపారు. గర్భిణీలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. రక్తస్రావం, తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పి, కాళ్ల వాపు వంటి సమస్యలు ఎదురైతే వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మత శిశు ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరు…
ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ వ్యాయామం చేసినట్లయితే సహజ కాన్పు అవుతారని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సూచించిన విధంగా వ్యాయామం చేసినట్లయితే సహజ కాన్పులు జరుగుతాయన్నారు. సహజ కాన్పు వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆపరేషన్ అయినట్లయితే అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య అధికారి మాలోతు బిచ్చు నాయక్, హెల్త్ సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్లు బోడ సునీత, మాధవి, మహేశ్, అనూష, శైలజ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)