Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సాగర్ కాలువలో రసాయనాల పారబోత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On November 1, unidentified individuals allegedly dumped hazardous chemicals into the Nagarjuna Sagar flood canal in Nalgonda district, causing the water to turn red and emit a foul odor.
Local residents and farmers expressed severe concern over the potential health and safety risks to the community and livestock.
Police and canal officials have launched an investigation and are reviewing CCTV footage to identify the perpetrators.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పెద్దవూర, నవంబర్ 1: నాగార్జునసాగర్ వరద కాలువలో గుర్తుతెలియని ప్రమాదకరమైన రసాయనాలను పారబోసిన ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండల వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో మండలంలోని చింతపల్లి సమీపంలో గల బసిరెడ్డిపల్లి ప్రాంతంలో కాలువలో ప్రవహిస్తున్న నీరు ఒకసారిగా ఎరుపు రంగులోకి మారి జిడ్డుగా ఉండటంతోపాటు ఘాటు వాసన రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలను కాలువ నీటిలోకి పారబోసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.
నీరు ఎరుపు రంగులోకి మారడంతోపాటు పరిసర ప్రాంతాల్లో వాసన వ్యాపించిందని స్థానికులు చెప్తున్నారు. కాలువ నీటిపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే వేలాది మంది ప్రజలు, రైతాంగం, మూగజీవాల భద్రతపై తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు, రైతులకు ఎలాంటి ప్రాణహాని, తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ ఘటనపై లోలెవల్ కెనాల్ ఏఈ, పెద్దవూర ఎస్సై గోపాలరావు స్పందిస్తూ కాలువలో ప్రమాదకర రసాయనాలు పారబోసిన వారిని త్వరలో గుర్తిస్తామని చెప్పారు. కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. పరిసర ప్రాంతాలతో పాటు రహదారుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)