Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సాగుకు సోలార్ పంపుసెట్లు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Redco CMD Jitesh V Patil announced the state will provide solar pump sets for agriculture.
He directed officials to accelerate the installation of already sanctioned solar pump sets and rooftop solar plants under the Gruha Jyothi scheme.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగుకు సోలార్ పంపుసెట్లను అందించనున్నట్టు రెడ్కో సీఎండీ జితేశ్ వీ పాటిల్ వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన సోలార్ పంపుసెట్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. టీజీ రెడ్కో వీసీ, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సోమవారం ఆ సంస్థ అధికారులు, జిల్లా మేనేజర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన పథకాల అమలును వేగవంతం చేసి గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. మాడల్ సోలార్ విలేజ్, రూఫ్‌టాప్ సోలార్, పీఎం కుసుమ్ పథకం, వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్, ఎలక్ట్రికల్ వాహన చార్జింగ్ స్టేషన్లపై ఆయన ఆరా తీశారు.
గృహజ్యోతి ఇండ్లపై సోలార్ ప్లాంట్లురూఫ్టాప్ సోలార్ పథకంలో భాగంగా గృహజ్యోతి పథకం కింద నిర్మించిన ఇండ్లపై విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రెడ్కో సీఎండీ జితేశ్ వీ పాటిల్ ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఆసక్తి చూపిన వారి ఇండ్లపై ప్లాంట్ల ఇన్స్టాలేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పీఎం కుసుమ్ లక్ష్యాల సాధనకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో రెడ్కో జీఎం సీఎస్వీ ప్రసాద్, జిల్లా మేనేజర్లు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)