Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సంక్షేమ పథకాల అమలు తీరుపై రాహుల్ ఆరా.. సోనియా ఆత్మకథ పుస్తకంపై స్పందనను అడిగి తెలుసుకున్న రాహుల్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Congress leader Rahul Gandhi visited Hyderabad to meet Chief Minister Revanth Reddy and other state leaders to discuss the implementation of welfare schemes and the state's real estate sector.
He also inquired about the public reaction to Sonia Gandhi's autobiography and directed the PCC chief to distribute the book to public representatives and intellectuals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరా తీశారు. భారత్ సమిట్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాహుల్.. హైటెక్స్ లోని నోవాటెల్ లో శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ భేటీ నిర్వహించారు. రాష్ట్రంలోని ఓబీసీల ఆర్థిక పరిస్థితులు, త్వరలో హైదరాబాద్ లో నిర్వహించనున్న ఓబీసీల సదస్సుపై చర్చించినట్లు తెలిసింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితిపైనా ఆరా తీసినట్లు సమాచారం.
రియల్ఎస్టేట్ఇటీవలి కాలంలో పుంజుకుంటున్న తీరును నేతలు వివరించినట్లు తెలిసింది. ‘సర్’ సాగిన తీరు, దానిపై ప్రజల్లో నిరసనలపై కూడా వివరాలు అడిగినట్టు సమాచారం. సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకంపై రాజకీయ పార్టీల నేతల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, జనం స్పందన గురించి కూడా రాహుల్ రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకున్నారు. సోనియా ఆత్మకథ పుస్తకాన్ని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు, మేధావులకు అందించాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ను రాహుల్ ఆదేశించారు. తన ఫోన్ ట్యాపింగ్, దేశంలో ప్రజాస్వామ్యం, ఇండియా కూటమికి దేశ వ్యాప్తంగా జనంలో వస్తున్న ఆదరణ వంటి విషయాలపై రాష్ట్ర నేతలతో రాహుల్ చర్చించినట్టు తెలిసింది.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)