Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
సంక్షేమ పథకాల అమలులో ప్రజా ప్రభుత్వం మరో ముందడుగు: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
By Eenadu1 min read at Eenadu
In brief
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామా ఉపేంద్రమ్ గార్డెన్లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదల జీవితాల్లో సంక్షేమ పథకాలను అమలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో 1,169 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లను మంజూరు చేశారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
తొర్రూరు: అర్హులైన నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని రామా ఉపేంద్రమ్ గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో 1,169 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు, వితంతువులు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన పింఛన్లను మంజూరు చేస్తోందని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల, పట్టణ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అధికారులు, నూతన పింఛన్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)