Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సర్కార్ భూములపై గద్దల్లా పెద్దలు
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that unidentified individuals, allegedly backed by the ruling party, are encroaching on government lands worth hundreds of crores in Survey Number 66/2, Serilingampally mandal, Hyderabad.
Local residents have questioned the inaction of revenue and survey officials regarding the construction of sheds and the leveling of hills.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎక్కడ సర్కార్ భూములు ఉంటే అక్కడ పెద్దలు గద్దల్లా వాలిపోతున్నారు. రాత్రికి రాత్రే కొందరు భారీ షెడ్లు, కంచెలు వేసి.. మరికొందరు బుల్డోజర్లతో కొండలను పిండి చేస్తూ భూములను చెరబడుతున్నారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 66/2లో మిగులుగా ఉన్న రూ.వందల కోట్ల విలువ చేసే 20 ఎకరాలపై కన్నేసి యథేచ్ఛగా ఆక్రమణ పనులు మొదలుపెట్టారు.
శేరిలింగంపల్లి, అక్టోబర్ 24: అక్రమార్కులు బరితెగించారు. ఏకంగా రూ.వందల కోట్ల భూముల కబ్జాకు తెగబడ్డారు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 66/2లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రశాంతి హిల్స్ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఈ మిగులు భూములపై అక్రమార్కులు కన్నేశారు. ఓవైపు రాత్రికి రాత్రే భారీ షెడ్లు, ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేస్తుండగా, మరోవైపు తమ ప్లాట్లంటూ కొందరు భారీ జేసీబీలతో కొండలను పిండి చేస్తూ చదును చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎక్కడున్నారు? ఆక్రమణలపై ఎందుకు స్పందించడం లేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)