Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
SBI Credit card: SBI క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఆ లావాదేవీలపై 1% ఫీజు
By Eenadu1 min read at Eenadu
In brief
According to SBI Credit card, a 1% additional fee will be charged on high transport and fuel transactions starting December 1.
This fee applies to transport transactions exceeding ₹30,000 and total fuel transactions exceeding ₹50,000 per billing cycle.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
SBI Credit card | ఇంటర్నెట్ డెస్క్: ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు . అధిక రవాణా, ఇంధన లావాదేవీలపై 1 శాతం అదనపు రుసుము ఎస్బీఐ కార్డ్ వసూలు చేయనుంది. డిసెంబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. అధిక రవాణా లావాదేవీ కింద ఒక్కో లావాదేవీ రూ.30 వేలు దాటితే ఆ మొత్తంపై 1 శాతం ఫీజు విధిస్తారు. ఉదాహరణకు రూ.35 వేలు ట్రాన్స్పోర్టేషన్ కోసం వినియోగిస్తే రూ.300 ఫీజు అదనంగా చెల్లించాలి. రూ.30వేలు పైబడిన లావాదేవీలకు మాత్రమే ఈ ఫీజు వర్తిస్తుంది. సరకు రవాణా, టోల్స్, బ్రిడ్జి ఫీజులు, బస్సు సర్వీసులు వంటివి ఈ కేటగిరీ కిందకు వస్తాయి.
అలాగే, ఒక బిల్లింగ్ సైకిల్లో మొత్తం పెట్రోల్, డీజిల్ లావాదేవీ పరిమితి రూ.50వేలు దాటితే మొత్తం ఫ్యూయల్ ఖర్చుపై 1 శాతం ఫీజు వసూలు చేస్తారు. ఒక బిల్లింగ్ సైకిల్లో ఫ్యూయల్ ఖర్చు రూ.55 వేలు అయిందనుకుంటే మొత్తం రూ.55 వేలకూ 1 శాతం చొప్పున రూ.550 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ట్యాక్సీలు నడిపేవారు, అత్యధికంగా పెట్రోల్/డీజిల్ వినియోగించేవారికి ఈ ఫీజు పడనుంది. అయితే, ఈ నిబంధనల వల్ల సాధారణ వినియోగదారులపై ప్రభావం తక్కువేనని చెప్పొచ్చు. వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం వ్యక్తిగత కార్డులు వాడేవారిపైనా, అధిక ప్రయాణ ఖర్చులు చేసేవారిపై ఈ ఫీజుల భారం పడుతుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)