Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
School Students Fall Ill | తారు ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం.. 62 మంది విద్యార్థులకు అస్వస్థత
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కేరళలోని కొల్లాం జిల్లాలో కొట్టియాం వద్ద ఉన్న తారు మిక్సింగ్ ప్లాంట్ కాలుష్యం కారణంగా బుధవారం ఆక్సిలియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు.
జిల్లా వైద్యాధికారి ప్రత్యేక వైద్య చికిత్స అందించాలని మంత్రి బిందు కృష్ణ ఆదేశించగా, డీవైఎఫ్ఐ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడంపై నిరసన చేపట్టారు.
గతంలో కూడా ఇదే పాఠశాలలో ఇలాంటి సంఘటనలు జరగడంతో పంచాయతీ ప్లాంట్ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించగా, ఆ కంపెనీ హైకోర్టును ఆశ్రయించి తిరిగి అనుమతి పొందింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తిరువనంతపురం: తారు మిక్సింగ్ ప్లాంట్ నుంచి వెదజల్లుతున్నది. దీంతో ఆ ప్లాంట్ సమీపంలోని స్కూల్కు చెందిన 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. (School Students Fall Ill) కేరళలోని కొల్లాం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొట్టియాంలోని తారు మిక్సింగ్ ప్లాంట్ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెదజల్లుతున్నాయి. ఈ కాలుష్యం కారణంగా బుధవారం ఆక్సిలియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. బాధిత విద్యార్థులను ఆసుపత్రికి తరలించి…
కాగా, బాధిత విద్యార్థులకు ప్రత్యేక వైద్య చికిత్స అందేలా చూడాలని జిల్లా వైద్యాధికారిని మంత్రి బిందు కృష్ణ ఆదేశించారు. అలాగే ఒక వైద్య బృందం ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. అయితే జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడంపై పాలక పక్షం సీపీఎంకు చెందిన యువజన విభాగమైన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సంఘటనపై ఆందోళనకు దిగారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)