Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
seated position: కుర్చీలోంచి లేవగలరా?
By Eenadu2 min read at Eenadu
In brief
వయసు పెరిగే కొద్దీ కుర్చీలోంచి లేవడం కష్టంగా మారుతుందని ఈ వ్యాసం వివరిస్తుంది.
కండరాల బలం, శరీర సమతుల్యత తగ్గడం దీనికి కారణమని తెలుపుతూ, వ్యాయామాలు మరియు యోగాసనాల ద్వారా దీనిని మెరుగుపరచుకోవచ్చని సూచించింది.
తగిన ఎత్తు ఉన్న కుర్చీని వాడటం మంచిదని కూడా పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రోజులో ఎన్నోసార్లు కుర్చీలోంచి లేస్తుంటాం. దీని గురించి అసలు ఆలోచించం కూడా. కానీ వయసు మీద పడుతున్నకొద్దీ మరీ మెత్తటి సోఫాలోంచో, తక్కువ ఎత్తు కుర్చీలోంచో లేవటం కష్టంగా అనిపిస్తుంటుంది. చేత్తో దన్నును గట్టిగా నొక్కి పట్టి, బలంగా శరీరాన్ని పైకెత్తితే గానీ నిలబడటం కుదరదు. కాలి బలం తగ్గటం, శరీర సమతుల్యత కొరవడటం, అంతగా కదలకపోవటం వంటివి కుర్చీలోంచి లేచి నిలబడటాన్ని కష్టంగా మారుస్తాయి. అలాగని నిరాశ వద్దు. కొన్ని జాగ్రత్తలతో వీటిని మెరుగుపరచుకోవచ్చు.
మనం అప్రయత్నంగానే కుర్చీలోంచి లేస్తుంటాం గానీ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా మొత్తం శరీరం బరువును పైకి లేపటానికి కండరాలు చాలా ప్రయత్నమే చేస్తాయి. తొడల ముందు భాగం కండరాలు మోకీళ్లను తిన్నగా చేస్తాయి. అదే సమయంలో పిరుదు కండరాలు శరీరం నిటారుగా అవటానికి సాయపడతాయి. పిక్కలు, మొండెం, ఇతర కండరాలూ తలో చేయి వేస్తాయి. ఇవి బలహీనమైతే నిల్చోవటం కష్టమైన పనిగా మారుతుంది. నిజానికి పైకి లేచి నిల్చోవటమూ అంత తేలికైన పనికాదు. లేచే ప్రయత్నంలో శరీరం ముందుకు వంగుతుంది. దీంతో శరీర బరువు కాళ్ల మీద మోపటం సాధ్యమవుతుంది. శరీర బరువు సరిగా పడినప్పుడు కాళ్లు నేలను బలంగా నెడతాం. అప్పుడు పైకి లేస్తాం. ఒకవేళ చలన శక్తి, బలం, శరీర…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)