Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 18, 2026
- Uttarakhand Sports Minister Rekha Arya released audio and video clips accusing her husband, BJP leader Pappu Girdhari, of physical abuse and threats. In response, Girdhari accused his wife of amassing assets worth Rs. 210 crores through corruption and called for an investigation by Chief Minister Pushkar Singh Dhami.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: మొగుడు-పెళ్లాం పంచాయితీ చివరకు ముఖ్యమంత్రి తేల్చాల్సిన పరిస్థితికి దారితీసింది. తన భర్త, ఉత్తర్ ప్రదేశ్కు చెందిన బీజేపీ నాయకుడు పప్పూ గిర్ధారీ తనను వేధిస్తున్నాడని, తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ క్రీడల శాఖ మంత్రి రేఖా ఆర్య గురువారం వీడియో, ఆడియో క్లిప్లు విడుదల చేశారు. మరుసటి రోజే గిర్ధారీ స్పందిస్తూ తన భార్య ద్వారా రూ.210 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టిందని ఆరోపించారు. తన భార్య నిర్వహిస్తున్న శాఖలో భారీ అవినీతి జరిగిందని, దీనిపైన, ఆమె ఆస్తులపైన దర్యాప్తు జరిపించాలని ఆయన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీని…
తన ఆరోపణలు తప్పని తేలితే ఎటువంటి శిక్షకైనా తాను సిద్ధమేనని కూడా ఆయన సవాలు చేశారు. నేను నిన్ను హింసించానని గోలు దేవత(ఉత్తరాఖండ్ ప్రజల ఆరాధ్య దేవత)పైన ప్రమాణం చేసి చెప్పగలవా? అంటూ తన భార్యకు సవాలు విసిరారు. అంతకుముందు మంత్రి రేఖ ఆర్య తన భర్తపైన డెహ్రాడూన్లోని కంటోన్మెంట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గిర్ధారీ తనను కొట్టాడని, వేధించాడని, కులం పేరుతో దూషించాడని, చంపుతానని బెదిరించాడని మంత్రి ఫిర్యాదు చేశారు. తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని ఆరోపిస్తూ ఒక ఆడియో రికార్డింగ్ని ఆమె విడుదల చేశారు. ఫేస్బుక్లో పెట్టిన ఒక వీడియోలో తన పిల్లల భద్రత కోసమే తాను తన భర్తపైన ఫిర్యాదు చేశానని వివరణ…