Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
SGF | ముగిసిన రాష్ర్ట ఎస్జీఎఫ్ అండర్-14 అథ్లెటిక్స్ టోర్నమెంట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The 70th Telangana State SGF Under-14 Boys' and Girls' Athletics Tournament and Championship 2026 concluded at Jawaharlal Nehru Stadium in Hanumakonda, with Rangareddy district winning the overall championship.
Approximately 300 athletes participated in the two-day event.
Hanumakonda District Youth and Sports Officer Kotha Prashanth attended the closing ceremony as the chief guest and distributed the awards.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11: హనుమకొండ జిల్లా ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహించిన 70వ తెలంగాణ రాష్ర్ట ఎస్జీఎఫ్ అండర్-14 బాలుర, బాలికల అథ్లెటిక్స్ టోర్నమెంట్ కమ్ ఛాంపియన్ షిప్- 2026 ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా రంగారెడ్డి జిల్లా నిలిచింది. రెండు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలలో క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారని హనుమకొండ జిల్లా ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.వాసుదేవరావు తెలిపారు.
ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌గా రంగారెడ్డి జిల్లా మొత్తం 50 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకుందన్నారు. బాలుర అండర్-14 ఛాంపియన్ షిప్ ఆదిలాబాద్ జిల్లా 29 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా 19 పాయింట్లతో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుందని, బాలికల అండర్-14 ఛాంపియన్ షిప్ రంగారెడ్డి జిల్లా 31 పాయింట్లతో ప్రథమ స్థానాన్ని సాధించగా, ఖమ్మం జిల్లా 24 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)