Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
షేక్ హసీనాను భారత్ అప్పగించకపోతే అంతర్జాతీయ కోర్టుకు వెళ్తాం: బంగ్లాదేశ్ - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ, షేక్ హసీనాను భారత్ అప్పగించకపోతే బంగ్లాదేశ్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయిస్తుందని వెల్లడించారు.
2024లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత న్యూఢిల్లీలో ఉంటున్న హసీనా, డిసెంబర్ 16న తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని ప్రకటించగా, ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ రాకపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
హసీనా తిరిగి వస్తే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతామని బంగ్లాదేశ్ స్పీకర్ హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage → · Followed over 18 days across 3 events →
షేక్ హసీనాను భారత్ తమకు అప్పగించకపోతే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయిస్తామని బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ వెల్లడించారు.పాకిస్థాన్‌లో ఆరు రోజుల పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.భారత్ తమ విజ్ఞప్తికి స్పందించకపోతే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తామని స్పష్టం చేశారు.ఒకవేళ హసీనా తిరిగి ఢాకాకు వస్తే వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని బీబీసీ ఉర్దూ వెల్లడించింది.
హసీనా రాక ప్రకటనతో మొదలైన వివాదం2024లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత షేక్ హసీనా భారత్‌లోని న్యూఢిల్లీలో ఉంటున్నారు.డిసెంబర్ 16న తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తానని ఆమె ప్రకటించారు. ఈ తేదీకి అక్కడ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ముగిసిన రోజును విజయ్ దివస్‌గా (విజయ దినోత్సవం) జరుపుకుంటారు.అయితే హసీనా తిరిగి రావాలన్న ప్రకటనపై ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.ఆమె రాకను అంగీకరించాలంటే చట్టపరమైన ప్రక్రియ ద్వారా భారత్ ఆమెను అప్పగించాల్సిందేనని స్పష్టం చేసింది.
This is Visalaandhra’s reporting. Read it where it was published.
Read the full story at Visalaandhra (opens in a new tab)