Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
శిరివెళ్లలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
By Eenadu||1 min read at Eenadu
In brief
నంద్యాల జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు ప్రశాంతంగా సాగిందని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.
శిరివెళ్ల నామినేషన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించి, కేవలం అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే గుర్తింపు కార్డులతో ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు.
మిగిలిన వారు గుంపులుగా రావద్దని, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా గుమిగూడటం నిషేధమని ఆయన హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శిరివెళ్ల: నంద్యాల జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు అన్ని కేంద్రాల్లో ప్రశాంతంగా సాగినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. శిరివెళ్లలో నామినేషన్ కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే సరైన గుర్తింపు కార్డులతో ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు. మిగిలిన వారు గుంపులుగా కేంద్రాల వద్దకు రావద్దని, అనవసరంగా గుమిగూడి కలిగించవద్దని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా గుమిగూడటం నిషేధమని హెచ్చరించారు. నిబంధలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద వీడియో గ్రఫీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)