Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
శోధ కంపెనీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కొత్తగూడెం ఏరియాలోని వీకే కోల్ మైన్‌లో శోధ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మట్టి వెలికితీత కాంట్రాక్టు కార్మికులు గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు తాత్కాలికంగా తెరపడింది.
సింగరేణి యాజమాన్యం చొరవతో జరిగిన చర్చల్లో కార్మిక సంఘాల జేఏసీ, శోధ కంపెనీ యాజమాన్య ప్రతినిధుల మధ్య పలు డిమాండ్లపై తాత్కాలిక ఒప్పందం కుదరడంతో కార్మికులు సమ్మెను విరమించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రుద్రంపూర్, నవంబర్ 18 : కొత్తగూడెం ఏరియాలోని వీకే కోల్ మైన్‌లో శోధ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన మట్టి వెలికితీత కాంట్రాక్టు కార్మికులు గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు తాత్కాలికంగా తెరపడింది. సింగరేణి యాజమాన్యం చొరవతో బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సీహెచ్ వెంకటరమణ సమక్షంలో కార్మిక సంఘాల జేఏసీ, శోధ కంపెనీ యాజమాన్య ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో పలు డిమాండ్ల పరిష్కారానికి తాత్కాలిక ఒప్పందం కుదరడంతో కార్మికులు సమ్మెను విరమించారు. చర్చల్లో భాగంగా 8.33 శాతం బోనస్‌కు అదనంగా బోనస్ చెల్లించే అంశం, సమ్మెలో పాల్గొన్న కార్మికులను విధుల…
ఈ చర్చల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శి నాగ సీతారాములు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు పాల్గొన్నారు. అలాగే ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి గట్టయ్య, టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, వంగా వెంకట్, జి. వీరస్వామి, మల్లికార్జున్, సలిగంటి శ్రీనివాస్, ఐఎన్టీయూసీ ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్, హెచ్ఎంఎస్ నాయకులు గడిపల్లి కృష్ణ ప్రసాద్, సీఐటీయూ నాయకులు నాగయ్య, ఐఎఫ్టీయూ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి ఎన్. సంజీవ్, బీఎంఎస్ నాయకులు పవన్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి యాకూబ్, డీడబ్ల్యూఎస్ నాయకులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)