Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
శ్రీశైలం ఖాళీ!..వాడకానికి మిగిలింది కేవలం 3.6 టీఎంసీలే
By V6 Velugu||3 min read at V6 Velugu
In brief
Hyderabad, Velugu: The Krishna basin faces a severe water crisis as the Srisailam project is nearly empty with only 3.635 TMC of usable water left.
Telangana claims it lost out on its share due to pending projects and alleged that neighboring Andhra Pradesh diverted 60.5 TMC of water during the floods.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: వానాకాలం ముగిసి చలికాలం మొదలవుతుండగానే కృష్ణా బేసిన్‌కు ముంచుకొచ్చింది. కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు ఖాళీ అయిపోయింది. డెడ్ స్టోరేజీ పోగా, ప్రాజెక్టులో వాడుకోదగిన నీరు కేవలం 3.635 టీఎంసీలే ఉంది. ఈ ఏడాది ఎగువ నుంచి శ్రీశైలానికి దాదాపు 220 టీఎంసీల మేర వరద రాగా.. పెండింగ్ప్రాజెక్టుల కారణంగా తన వాటా మేరకు నీటిని ఎత్తిపోసుకోలేని తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది.
ఇదే అదనుగా పొరుగు రాష్ట్రం ఏపీ ఏకంగా 60.5 టీఎంసీలను తోడేసుకున్నది. మన రాష్ట్రం కేవలం 19 టీఎంసీల నీళ్లే వాడుకున్నది. శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్‌కు దాదాపు 140 టీఎంసీల నీళ్లు వచ్చినా.. ప్రస్తుతం సాగర్‌లో డెడ్ స్టోరేజీకి ఎగువన వాడకానికి 52.5 టీఎంసీలే మిగిలాయి. రానున్న వేసవిలో హైదరాబాద్ మహానగరంతోపాటు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల దాహార్తి తీర్చే భారం పూర్తిగా నాగార్జునసాగర్‌పైనే పడింది. ఈ నీటిలో వాటాకోసం కూడా ఏపీ పేచీపెడ్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)