Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sircilla | బాల్యవివాహాల కట్టడికి మతపెద్దలు సహకరించాలి.. రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరీమా అగర్వాల్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని మతాల మతపెద్దలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, ఎస్పీ మహేష్ బీ గితే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలోని పూజారులు, పాస్టర్లు, ముస్లిం మతపెద్దలకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Sircilla | రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్, నవంబర్ 26 : బాల్యవివాహాల నిర్మూలనకు అన్ని మతాల మతపెద్దలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన, ఎస్పీ మహేష్ బీ గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పూజారులు, పాస్టర్లు, ముస్లిం మతపెద్దలకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు.
బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు నిర్వహించాలని అధికారులు స్పష్టం చేశారు. వివాహ వేడుకలు నిర్వహించే ముందు వధూవరుల వయస్సును ధ్రువీకరించుకోవడం తప్పనిసరి అని సూచించారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. అనంతరం బాల్యవివాహాల నిర్మూలనకు తమవంతు బాధ్యతగా కృషి చేస్తామని వివిధ మతాల మతపెద్దలతో ప్రతిజ్ఞ చేయించారు. బాలల భవిష్యత్తును కాపాడుతూ బాల్యవివాహాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)