Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
sjmit chitradurga college: లాస్‌వెగాస్‌లో ఎస్జేఎంఐటీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
By Eenadu1 min read at Eenadu
In brief
SJM College of Engineering alumni in Chitradurga held an emotional reunion in Las Vegas, USA, where about 200 alumni gathered to reminisce about their college days.
They discussed career, family, and retirement, and expressed gratitude to the organizers for a memorable event.
The alumni plan to meet again in 2028.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
చిత్రదుర్గలోని ఎస్జేఎంఐటీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అమెరికాలోని లాస్‌వెగాస్ నగరంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనంలో కళాశాలతో అనుబంధం ఉన్న సుమారు 200 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని, తమ కళాశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1980లో ప్రారంభమైన ఎస్జేఎంఐటీ కళాశాలలో తమకు బోధించిన గురువులు, స్నేహితులు, కళాశాలలో గడిపిన మరపురాని క్షణాలను ఆత్మీయంగా గుర్తుచేసుకున్నారు.
వృత్తి, కుటుంబ జీవితం, పదవీ విరమణ, భవిష్యత్ ప్రణాళికలు తదితర అంశాలపై ఆత్మీయంగా ముచ్చటించారు. ఎన్నేళ్లు గడిచినా తమ మధ్య స్నేహబంధం, అనుబంధం చెక్కుచెదరలేదని ఈ సమ్మేళనం మరోసారి చాటిచెప్పింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీధర్ గోనుగుంట్ల, శ్రీనివాస్ గొంది, వెంకట్ మలపాటి, భక్త బల్లా, మాదల శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, పాపి రెడ్డి, శరత్ పున్రెడ్డి, వంశీ గరికపాటి, శ్రీనివాస్ రెడ్డి ఎర్ర, చంద్ర రాగ్యారి, కృష్ణ పూర్రులకు పూర్వ విద్యార్థులందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)