Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
స్లీపర్ బస్సులో రూ.1.10 కోట్ల డ్రగ్స్ పట్టివేత
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The Directorate of Revenue Intelligence (DRI) seized 1.136 kg of methamphetamine worth ₹1.10 crores in a sleeper bus traveling from Bhopal to Hyderabad.
The smugglers abandoned the bus before the DRI officers conducted the search.
The investigation revealed that the passengers who boarded the bus in Bhopal got off in Nagpur.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: భోపాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టైంది. శనివారం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్లీపర్ బెర్త్‌లో దాచిన 1.136 కిలోల మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని అంతర్జాతీయ మార్కెట్ విలువ రూ.1.10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. భోపాల్ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు మెథాంఫెటమిన్ సరఫరా అవుతున్నట్లు డీఆర్ఐ వర్గాలకు పక్కా సమాచారం అందింది.
ఈ క్రమంలోనే హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సులో భారీగా డ్రగ్స్ తరలిస్తున్నట్లు గుర్తించి, మార్గమధ్యలో ఆపి తనిఖీలు చేపట్టారు. బస్సులోని స్లీపర్ బెర్త్‌ల కింద దాచి ఉంచిన నాలుగు డ్రగ్స్ ప్యాకెట్లను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. కాగా, ఈ స్మగ్లింగ్‌కు పాల్పడిన నిందితులు అధికారులు తనిఖీ చేయడానికి ముందే పరారయ్యారు. బస్సు డ్రైవర్‌ను విచారించగా.. ఆయా బెర్త్‌లలో ప్రయాణించిన వ్యక్తులు భోపాల్‌లో బస్సు ఎక్కి, నాగ్‌పూర్‌లో దిగిపోయినట్లు తేలింది. దీంతో పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
This is V6 Velugu’s reporting. Read it where it was published.
Read the full story at V6 Velugu (opens in a new tab)