Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Sukhbir Singh Badal, president of the Shiromani Akali Dal, stated that his party might form an alliance with the BJP for the upcoming Punjab assembly elections and is open to joining the NDA.
He also declared the Congress and AAP as his primary political rivals.
Badal has been attempting to rejoin the NDA after leaving it in 2020, following the SAD's electoral defeat in 2022.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sukhbir Badal : పంజాబ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని శిరోమణి అకాళిదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు, మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. తాము ఎన్డీయేలో చేరొచ్చని తెలిపారు. శుక్రవారం పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియాతో సుఖ్బీర్ సింగ్ భేటీ అయ్యారు. అనంతరం సుఖ్బీర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా.. తమ పార్టీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న వారితో కలిసి పని చేసేందుకు సిద్ధమన్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థులే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మిగిలి ఉన్నది బీజేపీయే కాబట్టి.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు పరోక్షంగా ప్రస్తావించారు. గతంలో అకాళిదళ్ పార్టీ ఎన్డీయే కూటమిలోనే ఉండేది. దీంతో ఈసారి కూడా ఆయన అదే కూటమిలో చేరుతారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని, అధికారం దక్కించుకోవాలని బాదల్ భావిస్తున్నారు. కొన్నేళ్లుగా ఎన్డీయేకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఆ కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)