Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
సుప్రీం చెప్పినా దీపతూన్ దగ్గరకు పోనివ్వలే.. పోలీసులు అడ్డుకున్నట్లు నిజం చెప్పిన పురావస్తు శాఖ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి తమిళనాడు పోలీసులు దీపతూన్ వద్ద కార్తీక దీపం వెలిగించకుండా అడ్డుకున్నారని భారత పురావస్తు శాఖ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు.
ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయగా, తమిళనాడు ప్రభుత్వం ఆలయ అధికారులపై నెపం నెట్టి క్షమాపణలు చెప్పింది.
ధర్మాసనం ఆలయ బోర్డును రద్దు చేసి, దీపతూన్ వద్ద దీపం వెలిగించేలా సీఆర్పీఎఫ్కి రక్షణ బాధ్యతలు అప్పగించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage → · Followed over 7 days across 2 events →
తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న 'దీపతూన్' స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను పక్కనపెట్టి.. దీపం వెలిగించకుండా అడ్డుకోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్లను జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వ తీరుపై, స్థానిక పోలీసుల వ్యవహారశైలిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
అధికారులను అడ్డుకున్న తమిళనాడు పోలీసులు: నవంబర్ 24న దీపతూన్ వద్ద ఒక్కసారి కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 20న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వెళ్లిన భారత పురావస్తు శాఖ అధికారులను తమిళనాడు పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆలయ ట్రస్టీలు చెప్పడంతో పాటు, పోలీసులు దీపం వద్దకు తమను వెళ్లనివ్వలేదని పురావస్తు శాఖ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)